కొనుగోలుదారులకు ఊహించని షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

by Naga Rani Yarlagadda |

పెళ్లిళ్లు, శుభకార్యాల వేళ వరుసగా తగ్గుతూ ఊరటనిస్తున్న బంగారం ధర.. గురువారం ఊహించని షాకిచ్చింది.

కొనుగోలుదారులకు ఊహించని షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లిళ్లు, శుభకార్యాల వేళ వరుసగా తగ్గుతూ ఊరటనిస్తున్న బంగారం ధర.. గురువారం ఊహించని షాకిచ్చింది. అనూహ్యంగా ధర పెరగడంతో కొనుగోలుదారులు అయోమయంలో పడ్డారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై ఏకంగా రూ.3770 పెరిగి.. రూ.1,44,550కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ.3450 పెరిగి.. రూ.1,32,500కి జంప్ అయింది. బంగారంతో పాటు వెండి ధర కూడా షాకిచ్చింది. కిలో వెండిపై రూ.5000 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,50,000వద్ద కొనసాగుతోంది. పెరిగిన ధరలకు జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు అదనంగా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాన్ని బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చు.

వరుసగా ధరలు తగ్గుతుండటంతో.. బంగారం ధర మరింత దిగి వస్తుందని ఎదురుచూస్తున్న వారికి ఇది నిజంగానే ఊహించని షాకని చెప్పాలి. ప్రస్తుతం పెళ్లిళ్లకు ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో బంగారం కొనుగోళ్లకు డిమాండ్ ఏర్పడింది. అలాగే ధర తగ్గడంతో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులకు ఆసక్తి చూపడం కూడా ధర పెరగడానికి కారణమైనట్లు నిపుణులు చెప్తున్నారు.

Next Story