- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లచ్చ తండాలో పోలీసుల విస్తృత తనిఖీలు.. గంజాయి ఆచూకీ చెబితే రూ.5వేల బహుమతి!
by Jakkula.Mamatha |
ప్రజా భద్రత మెరుగుపరచడానికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు సిఐ చంద్రమౌళి తెలిపారు.

X
దిశ,డోర్నకల్: ప్రజా భద్రత మెరుగుపరచడానికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు సిఐ చంద్రమౌళి తెలిపారు. ఎస్పీ డా.పి.శబరీష్, డీఎస్పీ తిరుపతిరావు ఆదేశాల మేరకు గురువారం లింబియా తండా పరిధి లచ్చ తండాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం జరిపారు. అక్రమంగా నిల్వ చేసిన నల్ల బెల్లం, పటిక, సారా స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేని 15 వాహనాలను గుర్తించారు. అదేవిధంగా రహదారి భద్రత, హెల్మెట్ ధారణ, మైనర్లు వాహనాలు నడుపుట,రోడ్డు ప్రమాదాలు, 5జీ, గంజాయి వినియోగం దుష్ప్రభావాలు, సైబర్ నేరాల నివారణ, మైనర్లకు సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు అమ్మకాలు నిషేధం పై అవగాహన కల్పించారు. గంజాయి క్రయ విక్రయాల పై సమాచారానికి రూ.5వేల బహుమతి అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఎస్సైలు ఝాన్సీ, రియాజ్ పాషా, ఏఎస్ఐ లక్ష్మయ్య, సిబ్బంది ఉన్నారు.
Next Story






