మా బంగారం.. మీలో కలిసిపోతుంది.. మరోసారి వైరల్ అయిపోతున్న సమంత

by Sujitha Rachapalli |

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’. కాగా ‘మా ఇంటి బంగారం.. మీలో కలిసిపోతుంది’ అని తెలుపుతూ.. ఈ సినిమా ట్రైల‌ర్‌ అప్డేట్ ఇచ్చారు.

మా బంగారం.. మీలో కలిసిపోతుంది.. మరోసారి వైరల్ అయిపోతున్న సమంత
X

దిశ, సినిమా : స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’. కాగా ‘మా ఇంటి బంగారం.. మీలో కలిసిపోతుంది’ అని తెలుపుతూ.. ఈ సినిమా ట్రైల‌ర్‌ను జనవరి 9న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ టీజర్ ట్రైల‌ర్‌ ప్రేక్షకులకు పవర్ఫుల్, ఇంటెన్స్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించ‌నుందని పేర్కొన్నారు. సామ్ భర్త రాజ్ నిడిమోరు కథ అందిస్తుండగా.. డైరెక్ట‌ర్ నందినీ రెడ్డి మూవీ డైరెక్ట్ చేస్తోంది. డిఫ‌రెంట్ ఎమోష‌న్స్‌‌తో కూడిన స్టోరీ, బోల్డ్‌ అండ్ గ్రిప్పింగ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా సినిమా ఉండబోతోందని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ చిత్రంలో సమంత ప్రధాన పాత్రను పోషిచ‌డంతోపాటు ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు కలిసి ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర ఆకట్టుకోగా.. ఈ చిత్రంలో దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి, మంజుషా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Next Story