రాష్ట్రంలో సంచలనం.. మహిళపై కాంగ్రెస్ నేత లైంగిక దాడి, వీడియోలతో బ్లాక్‌మెయిల్

by Malleboina Mahesh |   (  Updated:2026-07-02 05:36:05  IST  )

శేరిలింగంపల్లి గంగారం ఏరియాకు చెందిన సదరు సీనియర్ నేత ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా.. వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి రూ. 50 లక్షలు వసూలు చేశారు.

రాష్ట్రంలో సంచలనం.. మహిళపై కాంగ్రెస్ నేత లైంగిక దాడి, వీడియోలతో బ్లాక్‌మెయిల్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలోని హైదరాబాద్‌లో సంచలన ఘటన వెలుగుచూసింది. రాజకీయ వర్గాల్లో, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తీవ్ర సంచలనం రేకెత్తిస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడఐ కంది జ్ఙానేశ్వర్ పై చందానగర్ పోలీస్ స్టేషన్‌లో రేప్, బ్లాక్‌మెయిల్ కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. శేరిలింగంపల్లి గంగారం ఏరియాకు చెందిన సదరు సీనియర్ నేతకు, 2019లో భర్తను కోల్పోయి ఒంటరిగా ఉంటున్న ఒక వితంతువుతో 2024 లో పరిచయం ఏర్పడింది. మొదట్లో ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. అయితే, ఆ మహిళ పై కన్నేసిన నిందితుడు ఒకరోజు ఆమె తాగే పానీయం లో మత్తుమందు కలిపాడు. ఆమె స్పృహ తప్పిన తర్వాత ఆమెపై దారుణంగా లైంగిక దాడి (Rape) కి ఒడిగట్టడమే కాకుండా, ఆ దృశ్యాలను తన మొబైల్ ఫోన్‌లో వీడియో తీశాడు.

ఆ తర్వాత నిందితుడు తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. తన వద్ద ఉన్న నగ్న వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని, బంధువులకు చూపిస్తానని సదరు మహిళను భయభ్రాంతులకు గురిచేస్తూ నిరంతరం బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే బాధితురాలి నుంచి భయపెట్టి 50 లక్షల రూపాయలను దోచుకున్నాడు. నిందితుడి వేధింపులు రోజురోజుకూ మితిమీరి పోవడంతో, తట్టుకోలేకపోయిన బాధితురాలు చివరకు ధైర్యం చేసి చందానగర్ పోలీసులను ఆశ్రయించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. కేసును అత్యంత తీవ్రంగా పరిగణించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా కంది జ్ఙానేశ్వర్ ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలుస్తుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Next Story