- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గొప్పతనానికి విధి నిర్ణయించిన వీరుడు.. ‘పినాక’ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్న తరుణంలో, చిత్రబృందం తాజాగా ఈ మూవీ అఫీషియల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది.

దిశ, సినిమా: కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న గోల్డెన్ స్టార్ గణేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మైథలాజికల్ డ్రామా ‘పినాక’. ఈ సినిమాతో ప్రముఖ కొరియోగ్రాఫర్ బి ధనంజయ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఇందులో గణేష్ సరసన నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తుండగా.. రంగయణ రఘు, శ్రీనివాస మూర్తి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రమఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్ అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్న తరుణంలో, చిత్రబృందం తాజాగా ఈ మూవీ అఫీషియల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది.
నేడు జూలై2న గోల్డెన్ స్టార్ గణేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ సినిమాను అక్టోబర్ 2న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. ఈ రిలీజ్ డేట్ ప్రకటనతో పాటు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ను షేర్ చేశారు. "ఊహకు అందని తపన.. కాలానికి మించిన రహస్యం.. గొప్పతనానికి విధి నిర్ణయించిన వీరుడు.. అక్టోబర్ 2, 2026న ప్రపంచవ్యాప్తంగా సినిమాహాళ్లలో ‘పినాక’ అద్భుతం, రహస్యాన్ని అనుభవించండి" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీనితో పాటు విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో హీరో గణేష్ చేతిలో ఒక భూతద్దాన్ని పట్టుకుని, దేనినో చాలా నిశితంగా పరిశీలిస్తూ షాక్‌కు గురైనట్లు ఉన్న లుక్ ప్రేక్షకులలో విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతోంది. మైథలాజికల్ ఎలిమెంట్స్‌తో, సస్పెన్స్ అండ్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా గణేష్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నిలవనుంది.






