సమంత ఫ్యాన్స్ గెట్ రెడీ అంటూ మా ఇంటి బంగారం అప్డేట్ ఇచ్చిన మేకర్స్

by Chukka Sudharani |   (  Updated:2026-05-31 11:00:43  IST  )

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు పెంచిన సమంత.. హీరోయిన్‌గా, నిర్మతగా రాణిస్తూ మెప్పిస్తుంది.

సమంత ఫ్యాన్స్ గెట్ రెడీ అంటూ మా ఇంటి బంగారం అప్డేట్ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు పెంచిన సమంత.. హీరోయిన్‌గా, నిర్మతగా రాణిస్తూ మెప్పిస్తుంది. ఈ క్రమంలోనే తన సొంత బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి నిర్మిస్తున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఇందులో సమంత ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తుంది. ‘ఓ బేబీ’ తర్వాత నందిని రెడ్డి, సమంత కలయికలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 15న రావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల చేత వాయిదా పడింది. ఇప్పుడు జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస అప్డేట్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా.. తాజాగా ఓ పోస్ట్ షేర్ చేశారు మేకర్స్. ‘సమంత అభిమానులారా, సాయంత్రం 6 గంటలకు మా ఇంటి బంగారం నుంచి ఒక సర్ప్రైజ్ కోసం సిద్ధంగా ఉండండి.. మీ అందరికీ ఇది ఖచ్చితంగా నచ్చుతుంది’ అంటూ తెలిపారు. దీంతో మా ఇంటి బంగారం నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందో అంటూ ఈగర్‌గా వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Mirchi Madhavi: కెరీర్ స్టార్టింగ్‌లో షాకింగ్ ఘటన.. దర్శకుడినని ఇంటికొచ్చి అలా చేశాడు

Next Story