Mirchi Madhavi: కెరీర్ స్టార్టింగ్‌లో షాకింగ్ ఘటన.. దర్శకుడినని ఇంటికొచ్చి అలా చేశాడు

by Pulgam srinivas |

దర్శకుడినని చెప్పి ఇంటికి వచ్చిన వ్యక్తి ప్రవర్తనపై అనుమానం రావడంతో గట్టిగా ఎదిరించానని మిర్చి మాధవి తెలిపింది.

Mirchi Madhavi: కెరీర్ స్టార్టింగ్‌లో షాకింగ్ ఘటన.. దర్శకుడినని ఇంటికొచ్చి అలా చేశాడు
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో మిర్చి మాధవి ఒకరు. ఈమె సీరియల్స్ ద్వారా కెరీర్‌ను ప్రారంభించి, అనంతరం పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం కూడా మాధవి సీరియల్స్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. ఇక కొంతకాలం క్రితం ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూకు సంబంధించిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఆమె తన కెరీర్ ప్రారంభ రోజుల్లో ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది.

మిర్చి మాధవి మాట్లాడుతూ.. చాలా సంవత్సరాల క్రితం నేను చాలా అమాయకంగా, ఇన్నోసెంట్‌గా ఉండేదాన్ని. సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో దిల్‌సుఖ్‌నగర్‌లో ఉన్న మా ఇంటికి ఒక వ్యక్తి తాను దర్శకుడినని చెప్పి వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో నేను, మా అమ్మ, మా ఇంట్లో పని చేసే అమ్మాయి మాత్రమే ఉన్నాం. ఆ సమయంలో నేను మామూలు చీర కట్టుకొని ఉండగా, అతను ‘ఇలాంటి చీర కట్టుకో’ అంటూ కొన్ని సలహాలు ఇవ్వడం ప్రారంభించాడు.

దాంతోనే అతని ఉద్దేశం నాకు అర్థమైంది. వెంటనే ‘ముందు బయటికి వెళ్లండి, లేకపోతే చెప్పుతో కొడతాను’ అని గట్టిగా చెప్పాను. అయితే ఇంట్లో మేము ముగ్గురం మహిళలమే ఉండటంతో కొంత భయపడ్డాం. తలుపులు లాక్ చేసుకుని ఉన్నాం. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తే విషయం పెద్దది అవుతుందనే ఉద్దేశంతో మా అమ్మ వెనక్కు తగ్గింది. అలా కెరీర్ ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను” అని మిర్చి మాధవి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Next Story