- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్కినేని ఫ్యామిలీకి వార్నింగ్ ఇచ్చిన సమంత ?
టాలీవుడ్ ( Tollywood) స్టార్ హీరోలలో సమంత ఒకరు. అయితే అలాంటి సమంత ( Samantha).. తాజాగా చేసిన కామెంట్స్.. టాలీవుడ్ ఇండస్ట

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ( Tollywood) స్టార్ హీరోలలో సమంత ఒకరు. అయితే అలాంటి సమంత ( Samantha).. తాజాగా చేసిన కామెంట్స్.. టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఆమె ఎవరిని అన్నదో తెలియదు కానీ... ఆమె చేసిన వ్యాఖ్యలు అక్కినేని కుటుంబాన్ని ( Akkineni family) ఉద్దేశించి చేసినవే అని కొంతమంది చర్చించుకుంటున్నారు. తనకు రూల్స్ పెడితే నచ్చదని.. నాకు ఇష్టం వచ్చినట్లు జీవించాలనుకుంటున్నానని తాజాగా సమంత సంచలన వ్యాఖ్యలు చేసింది. సక్సెస్ అంటే గెలవడం మాత్రమే కాదని... ప్రయత్నించడం కూడా విజయంలో ఒక భాగం అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
రికార్డులు వస్తే కాదు.... తనకు నచ్చినట్లు బతికితే అది సక్సెస్ అని... హీరోయిన్ సమంత వెల్లడించారు. తాజాగా సిడ్నీలో జరిగిన ఒక ఈవెంట్ లో హీరోయిన్ సమంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన లైఫ్ అలాగే సక్సెస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హీరోయిన్ సమంత. ఆడపిల్ల కాబట్టి ఆ పని.. ఈ పని చేయకూడదని రూల్స్ పెడితే... చంపేయాలనిపిస్తుందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఇష్టం వచ్చినట్లు జీవించాలనుకుంటున్న... నన్ను ఎవరు ఆపలేరు అన్నారు.
అలాగే లైఫ్ లో దాంతోపాటు సినిమాల్లో తనకు నచ్చిన పాత్రలు చేస్తానని... అప్పుడే నా లైఫ్ సక్సెస్ అవుతుందని తెలిపారు. అయితే సమంత చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు అక్కినేని కుటుంబాన్ని ఉద్దేశించి చేసినవని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అక్కినేని నాగచైతన్య ( Nagachaitanya) భార్యగా ఉన్నప్పుడు సమంతా పై అనేక ఆంక్షలు... అక్కినేని కుటుంబం పెట్టిందని.. అందుకే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని అప్పట్లో ఒక రూమర్ బయటకు వచ్చింది. ఇప్పుడు సమంత కూడా దానికి తగ్గట్టుగానే కామెంట్స్ చేశారు. ఈ తరుణంలోనే సమంత చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.
Read More..






