- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టార్ డైరెక్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన ధరమ్ తేజ్ బ్యూటీ.. అందుకే పత్తా లేకుండా పోయిందంటూ నెటిజన్ల ట్రోల్స్
‘పిల్లా నువ్వు లేని జీవితం’(Pilla Nuvvu Leni Jeevitham) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ రెజీనా కసాండ్రా(Regina Cassandra) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ‘పిల్లా నువ్వు లేని జీవితం’(Pilla Nuvvu Leni Jeevitham) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ రెజీనా కసాండ్రా(Regina Cassandra) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. దీంతో ఆఫర్లు వచ్చాయి. కానీ అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు. ప్రస్తుతం కోలీవుడ్(Kollywood), బాలీవుడ్(Bollywood)కి చెక్కేసి అక్కడ వరుస సినిమాలు చేస్తూ హీరోయిన్ రాణిస్తోంది.
అలాగే వెబ్ సిరీస్‌లోనూ నటిస్తూ మెప్పిస్తోంది. ఈ క్రమంలో ఈ భామకు సంబంధించిన ఓ రూమర్ నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. రెజీనా కెరీర్ ప్రారంభంలోనే స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Sekhar Kammula) సినిమాను రిజెక్ట్ చేసిందట. ఆ సినిమాను చేసుంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ క్రేజ్ మరోలా ఉండేది. ‘శివ మనసులో శృతి’(Shiva Manasulo Sruthi) సినిమాతో పాటు శేఖర్ కమ్ముల తెరకెక్కించే ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’(Life Is Beautiful) సినిమాలో సెలెక్ట్ అయ్యిందట.
కానీ రెండు సినిమాలు ఒకేసారి డేట్స్ ఇవ్వడం కుదరకపోవడంతో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీ నుంచి తప్పుకుందట. ఇక ఆ సినిమా ఎంతగా హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. కానీ శివ మనసులో శృతి చిత్రం ఓకే ఓకే టాక్ తెచ్చుకుంది. అయితే ఈ భామ మంచి చాన్స్ మిస్ చేసుకుందనే చెప్పాలి. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ విషయంపై నెటిజన్లు స్టార్ డైరెక్టర్ సినిమాను రిజెక్ట్ చేసింది కాబట్టే నేడు తెలుగు ఇండస్ట్రీలో పత్తా లేకుండా పోయిందంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
Read More..






