రాజ్‌తో పెళ్లైన తర్వాత మరింత గ్లామరస్‌గా తయారైన సమంత.. సూపర్ క్యూట్ ఫొటోస్ వైరల్

by I. Sairam |   (  Updated:2026-02-06 04:45:27  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

రాజ్‌తో పెళ్లైన తర్వాత మరింత గ్లామరస్‌గా తయారైన సమంత.. సూపర్ క్యూట్ ఫొటోస్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘ఏమాయ చేశావే’(Ye Maya Chesave) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది.. ఇండస్ట్రీకి వచ్చిన అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లిపోయింది. ఇక అక్కినేని హీరో నాగచైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడి అతన్నే మ్యారేజ్ చేసుకున్న ఈ బ్యూటీ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత మయోసైటీస్ వ్యాధి బారిన పడి దాదాపు సంవత్సరం పాటు సినిమాలకు దూరంగా ఉన్నది. ఆ తర్వాత సిటాడెల్ సినిమాతో మంచి విజయం సాధించింది.

ఇక రీసెంట్‌గా బాలీవుడ్ దర్శకుడు రాజ్‌ నిడిమోరు(Raj Nidimoru)తో పెళ్లిపీటలెక్కింది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో యోగా ఆశ్రమంలో ఉన్న లింగ భైరవి ఆలయంలో వీరి పెళ్లి జరిగింది. ఇక మ్యారేజ్ తర్వాత మళ్లీ తమ ప్రొఫెషనల్ వర్క్స్‌లో బిజీ అయిపోయింది సమంత. ‘శుభం’(Shubham) సినిమాతో నిర్మాతగా సక్సెస్ అందుకున్న సామ్ ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’(Ma Inti Bangaram) సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు కూడా సామ్‌నే నిర్మాతగా వ్యవహరిస్తోంది. దీనికి లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో బాలీవుడ్ ప్రముఖ నటుడు కాంతార విలన్ గుల్షన్ దేవయ్య, దివ్వేందు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. సామ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గాఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నిత్యం ఏదో ఒక పోస్టులతో ఫాలోవర్స్‌కు దగ్గరవుతూ ఉంటుంది. అంతెందుకు ఆమె హెల్త్ బాలేని టైంలో కూడా సోషల్ మీడియాలోయాక్టీవ్‌గా ఉంటూ తన ఆరోగ్యం గురించి అప్డేట్ ఇస్తూ ఉండేది. ఈ క్రమంలో ఈ చిన్నదానికి సంబంధించిన కొన్ని సూపర్ క్యూట్ ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారాయి. రాధా లుక్‌లో రెడీ అయిన సామ్ తన నవ్వుతో ఫ్యాన్స్‌కు మతిపోగోడుతున్నది. లంగాఓణీ కట్టుకొని జ్యూవెలరీ పెట్టుకొని జడ కూడా అల్లుకొని పాపిట బిళ్ల పెట్టుకొని నవ్వుతూ ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. అయితే ఈ పిక్స్‌లో మయోసైటీస్ వ్యాధి రానప్పుడు ఎలా కొంచెం బొద్దుగా ఉండేదో అలా అనిపించింది. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక దీన్ని చూసిన నెటిజన్లు రాజ్‌తో మ్యారేజ్ అయిన తర్వాత నీ గ్లామర్ మరింత పెరిగిపోతుందని, రాధా కృష్ణాకు సంబంధించిన సినిమా, సిరీస్‌లో రాధాగా బాగా సెట్ అవుతావని, నువ్వు ఇలాగే నవ్వుతూ హ్యాపీగా ఉండమని కామెంట్స్ చేస్తున్నారు.

అదే నా అసలైన విజయం.. నాకు రిస్క్ తీసుకోవడమే ఇష్టమంటూ స్టార్ కిడ్ షాకింగ్ కామెంట్స్


Next Story