అదే నా అసలైన విజయం.. నాకు రిస్క్ తీసుకోవడమే ఇష్టమంటూ స్టార్ కిడ్ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-06 04:46:16  IST  )

బాలీవుడ్ యంగ్ బ్యూటీ శనయా కపూర్(Shanaya Kapoor) కెరీర్ ప్రయాణంపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.

అదే నా అసలైన విజయం.. నాకు రిస్క్ తీసుకోవడమే ఇష్టమంటూ స్టార్ కిడ్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ శనయా కపూర్(Shanaya Kapoor) కెరీర్ ప్రయాణంపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. తన తొలి చిత్రం ‘ఆంఖోన్ కీ గుస్తాఖియాన్’ (Aankhon Ki Gustaakhiyan) ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయనప్పటికీ, ఆమె మాత్రం ఆ అనుభవాన్ని ఒక మధుర జ్ఞాపకంగా భావిస్తోంది. రివ్యూలు, ఫలితాలతో సంబంధం లేకుండా, తనను తాను మొదటిసారి వెండితెరపై చూసుకోవడం ఒక నటిగా తన జీవితంలోనే అది అతిపెద్ద విజయం అని.. ఆ క్షణాన్ని తాను పూర్తిగా ఆస్వాదించానని ఆమె స్పష్టం చేసింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శనయా.. ‘‘థియేటర్ నిండా ప్రేక్షకులు ఉండాలని, అందరి ప్రేమను పొందాలని ఏ నటికైనా ఉంటుంది. కానీ నా మొదటి సినిమా విషయంలో అది పూర్తిగా జరగకపోయినా నేను కృంగిపోలేదు.

వెండితెరపై నన్ను నేను మొదటిసారి చూసుకోవడమే నా అసలైన విజయంగా భావించాను. ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ కోసం నేను చాలా కాలం వెయిట్ చేశాను. ఆ సమయంలో వచ్చిన ప్రేక్షకుల ఆదరణే నాకు గొప్ప ప్రేరణనిచ్చింది’’ అని తెలిపింది. సినిమా ఫలితం తనను మానసికంగా దెబ్బతీయలేదని, తన దృష్టంతా ఎప్పుడూ ముందడుగు వేయడం పైనే ఉంటుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది. ఒక సినిమా ఫలితం తన స్క్రిప్ట్ ఎంపికలను మార్చలేదని.. కేవలం గుడ్డిగా వెళ్లకుండా, తన మనసుకు నచ్చిన కథలనే ఎంచుకుంటానని ఆమె పేర్కొంది. నా తదుపరి చిత్రం 'తూ యా మైన్' పనుల్లో బిజీగా ఉన్నాను. పనిలో నిమగ్నమవ్వడమే అన్ని సమస్యలకు పరిష్కారం’’ అని శనయా చెప్పుకొచ్చింది.

భవిష్యత్తులో తాను చేయబోయే సినిమాల గురించి చెబుతూ.. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కానని ఆమె పేర్కొంది. ‘‘నేను రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కొత్త జోనర్లను అన్వేషించాలనుకుంటున్నాను. నా మనసు ఏదైనా స్క్రిప్ట్‌కు కనెక్ట్ అయితే, దాని సక్సెస్ రేటుతో సంబంధం లేకుండా ముందుకు వెళ్తాను. నటిగా ప్రయోగాలు చేయడం, విఫలమవ్వడం, మళ్ళీ నేర్చుకోవడం.. ఇదే అసలైన ప్రయాణం. నిరంతరం నేర్చుకోవాలనే తపన ఉన్నప్పుడే నటిగా గుర్తింపు లభిస్తుందని’’ అని శనయా చెప్పింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వంటింట్లోనూ రొమాన్స్..దివి సినిమాపై పెరిగిన అంచ‌నాలు

Next Story