కల్కీ-2లో సాయి పల్లవి.. ఆమె బదులు కార్తీక దీపం దీప సెట్ అవుతుందంటూ నెట్టింట ట్రోల్

by I. Sairam |   (  Updated:2026-01-31 05:22:49  IST  )

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కల్కి 2898ఏడీ’(Kalki 2898AD) ఎంతటి విజయాన్ని సాధించిందో స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

కల్కీ-2లో సాయి పల్లవి.. ఆమె బదులు కార్తీక దీపం దీప సెట్ అవుతుందంటూ నెట్టింట ట్రోల్
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కల్కి 2898ఏడీ’(Kalki 2898AD) ఎంతటి విజయాన్ని సాధించిందో స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. అంతేకాకుండా కలెక్షన్ల విషయంలోనూ ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. నాగ్ అశ్విన్(Nag Ashwin ) తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే(Deepika Padukone) హీరోయిన్‌గా నటించింది. ఆమె పోషించిన ‘సుమతి’ పాత్ర చుట్టూనే కథ అంతా తిరుగుతుంది. రెండో భాగంలో ఆ పాత్ర ప్రాధాన్యత మరింత ఎక్కువగా ఉంటుందట.

అయితే.. దీపికాను ఆ సినిమా నుంచి తప్పించిన విషయం తెలిసిందే. అయితే ఆమె ప్లేస్‌లో దర్శకుడు నాగ్‌అశ్విన్‌ సాయిపల్లవి(Sai Pallavi)ని చూస్ చేసుకున్నాడనే ఓ వార్త గత కొన్ని రోజులుగా వినిపిస్తోంది. ఈ క్రమంలో ఓ ఫొటో నెట్టింట ట్రోల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఫొటోలో కల్కీ గెటప్‌లో ప్రభాస్ అండ్ సాయి పల్లవి కనిపించారు. నేచురల్ బ్యూటీ కడుపుతో ఉండగా ఆమెను డార్లింగ్ హత్తుకున్నట్లు ఉంది. ఇక ఈ పిక్‌కు ప్రభాస్ పక్కన సాయి పల్లవి ఎలుక పిల్లలా ఉంది అని, సాయి పల్లవి బదులు కార్తీక దీపం దీపను పెట్టినా సెట్ అవుతుంది అని, ఏడ్చే క్యారెక్టర్ ఉంటే ఫర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుంది అని వివిధ రకాలుగా ట్రోల్ చేస్తుండగా.. మరికొంత మంది మాత్రం ఆమెకు సపోర్టుగా కామెంట్స్ చేస్తున్నారు.

Read More..

మన టైమ్ స్టార్ట్ అయింది.. ‘ది రాజాసాబ్’ స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన విడుదల


Next Story