- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ritesh Rana: నేను అలా కన్వీన్స్ చేసే వరకు సత్య హీరోగా నటించడానికి అసలు ఒప్పుకోలేదు
జెట్లీ కథలో నువ్వే హీరో అనగానే మొదట సత్య వద్దన్నాడు. తర్వాత కథ సాగే విధానాన్ని క్లియర్‌గా వివరించడంతో చివరకు అంగీకరించినట్లు దర్శకుడు రితేష్ రానా తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన కమెడియన్లలో ఒకరైన సత్య తాజాగా “జెట్లీ” అనే చిత్రంలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు రితేష్ రానా దర్శకత్వం వహించారు. ఈయన గతంలో తెరకెక్కించిన మత్తు వదలరా, హ్యాపీ బర్త్‌డే, మత్తు వదలరా 2 వంటి చిత్రాల్లో సత్య తన అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న నాలుగవ చిత్రం కావడం, అందులో సత్య మెయిన్ లీడ్‌గా నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని మే 1వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రితేష్ రానా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ వస్తున్నాడు.
అందులో భాగంగా సత్యను ఈ సినిమాలో హీరోగా ఎలా ఒప్పించానో వివరించారు. ఆయన మాట్లాడుతూ ఒక రోజు సత్యను కలసి కథను వివరించానని చెప్పారు. ఆ సమయంలో సత్య తాను ఒక పాత్ర మాత్రమే చేస్తున్నానని భావించాడని తెలిపారు. కథ మొత్తం చెప్పిన తర్వాత “ఈ సినిమాలో నువ్వే హీరో” అని చెప్పగానే ఆయన షాక్ అయ్యారని, మొదట చేయను అన్నట్లుగా స్పందించారని వెల్లడించారు. తర్వాత కథ సాగే విధానాన్ని క్లియర్‌గా వివరించడంతో సత్య చివరకు అంగీకరించినట్లు దర్శకుడు రితేష్ రానా తెలిపారు. ఈ సినిమాలో రియా సింఘా హీరోయిన్‌గా నటించగా, మైత్రీ మూవీ మేకర్స్ & క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.






