సెన్సార్ కంప్లీట్ చేసుకున్న జెట్లీ

by Pulgam srinivas |   (  Updated:2026-04-25 09:24:15  IST  )

సెన్సార్ బోర్డు జెట్లీ సినిమాకు “U/A” సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న జెట్లీ
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు ప్రముఖ కమెడియన్ సత్య తాజాగా ‘జెట్లీ’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను మే 1వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు “U/A” సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే రితేష్ రాణా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రియా సింఘా హీరోయిన్‌గా నటించగా, వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

Ritesh Rana: నేను అలా కన్వీన్స్ చేసే వరకు సత్య హీరోగా నటించడానికి అసలు ఒప్పుకోలేదు

Next Story