రణవీర్ సింగ్‌కు సపోర్ట్ చేయబోయి చిక్కుల్లో పడిన ఆర్జీవీ.. వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ FWICE డిమాండ్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-06-03 14:52:10  IST  )

వర్మ ఒక నిజాన్ని గుర్తుంచుకోవాలి. 2017లో ఆయన తీసిన ‘ఆఫీసర్’ అనే తెలుగు సినిమాకు సంబంధించి టెక్నీషియన్లు, కార్మికులకు దాదాపు రూ. 1 కోటి 25 లక్షల రూపాయల జీతాలు ఇప్పటికీ బాకీ ఉన్నారు.

రణవీర్ సింగ్‌కు సపోర్ట్ చేయబోయి చిక్కుల్లో పడిన ఆర్జీవీ.. వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ  FWICE డిమాండ్!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ (FWICE) వివాదంలో ఊహించని మలుపు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ‘డాన్ 3’ సినిమా నుండి రణవీర్ తప్పుకోవడంతో ఫర్హాన్ అక్తర్‌కు నష్టం కలిగిందనే కారణంతో ఆయనపై విధించిన సహాయ నిరాకరణ ఆదేశాలను FWICE అధికారికంగా ఉపసంహరించుకుంది. రణవీర్ పంపిన లీగల్ నోటీసుల తర్వాత ఫెడరేషన్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ వివాదంలో రణవీర్ సింగ్‌కు సపోర్ట్ చేస్తూ, యూనియన్‌ను బ్యాన్ చేయాలంటూ ఘాటుగా ట్వీట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చిక్కుల్లో పడ్డారు. రీసెంట్‌గా జరిగిన ప్రెస్ మీట్‌లో వర్మపై FWICE చీఫ్ అడ్వైజర్ అశోక్ పండిట్ మండిపడ్డారు. వర్మ కార్మికులకు బాకీ ఉన్న కోట్ల రూపాయల నిజాన్ని బయటపెట్టారు.. "వర్మ మా యూనియన్‌ను అవమానిస్తూ అసభ్య పదజాలంతో ట్వీట్ చేశారు.

కానీ ఆయన ఒక నిజాన్ని గుర్తుంచుకోవాలి. 2017లో ఆయన తీసిన ‘ఆఫీసర్’ అనే తెలుగు సినిమాకు సంబంధించి టెక్నీషియన్లు, కార్మికులకు దాదాపు రూ. 1 కోటి 25 లక్షల రూపాయల జీతాలు ఇప్పటికీ బాకీ ఉన్నారు. ఈ బకాయిలు చెల్లిస్తానని 2019లో ఆయనే స్వయంగా మాకు లేఖ రాశారు. మనం ఇప్పుడు 2026లో ఉన్నాం, కానీ ఆ డబ్బు మాత్రం ఇప్పటికీ రాలేదు. కార్మికుల డబ్బులు ఎగ్గొట్టిన వర్మ.. మా యూనియన్‌ను బ్యాన్ చేయాలని మాట్లాడటం హాస్యాస్పదం. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి" అని అశోక్ పండిట్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రణవీర్ సింగ్‌కు సపోర్ట్ చేయబోయి వర్మ అడ్డంగా ఇరుక్కున్నారని నెటిజన్లు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.

‘కన్నప్ప’ షూటింగ్ సమయంలో నాన్‌వెజ్ తినడం తప్పుగా అనిపించలేదన్న మంచు విష్ణు.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Next Story