- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కన్నప్ప’ షూటింగ్ సమయంలో నాన్‌వెజ్ తినడం తప్పుగా అనిపించలేదన్న మంచు విష్ణు.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
కన్నప్ప సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో నాన్ వెజ్ తినడం నాకు అస్సలు తప్పుగా అనిపించలేదు. నేను నిజం చెబుతున్నాను.. ఆ క్యారెక్టర్ కోసం బాడీని పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేయాల్సి వచ్చింది.

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చిన విష్ణు ఎన్నో చిత్రాల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. అయినప్పటికీ కొద్ది కాలంపాటు సినిమాలకు దూరం అయ్యారు. మళ్లీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. పరమశివుని పరమ భక్తుడైన భక్త కన్నప్ప కథ ఆధారంగా, అత్యంత భారీ బడ్జెట్‌తో, పాన్ ఇండియా లెవెల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలవడమే కాకుండా.. మంచు విష్ణుపై తీవ్రమైన విమర్శలు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మంచు విష్ణు చేతిలో కొత్త ప్రాజెక్టులు ఏవీ లేవు. ఈ క్రమంలోనే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆయనపై మళ్లీ ట్రోలింగ్స్ మొదలుపెట్టేలా చేశాయి.
విష్ణు మాట్లాడుతూ.. "కన్నప్ప సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో నాన్ వెజ్ తినడం నాకు అస్సలు తప్పుగా అనిపించలేదు. నేను నిజం చెబుతున్నాను.. ఆ క్యారెక్టర్ కోసం బాడీని పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేయాల్సి వచ్చింది. దానికి కావాల్సిన ప్రోటీన్స్ బాడీకి అందాలంటే నాన్ వెజ్ తినడం చాలా ముఖ్యం. అందుకే నేను షూటింగ్ టైమ్‌లో కూడా నాన్ వెజ్ తిన్నాను. పైగా నేను పుట్టుకతోనే నాన్ వెజిటేరియన్‌ను కాబట్టి.. ఆ సమయంలో మాంసం తినడం నాకేమీ తప్పుగా అనిపించలేదు" అని చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ గురించి తెలుసుకున్న నెటిజన్లు.. ఒక భక్తిరస చిత్రంలో, అది కూడా శివభక్తుడి పాత్ర వేస్తూ షూటింగ్ సమయంలో నాన్ వెజ్ తినడం ఏంటని మండిపడుతున్నారు. అంతేకాకుండా మీమ్ క్రియేటర్లు విష్ణుపై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. "షూటింగ్ టైమ్‌లో నాన్ వెజ్ తినడం కాదు విష్ణు.. నువ్వు అసలు సినిమాలు చేయడమే పెద్ద తప్పు" అంటూ కామెంట్లు పెడుతూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. భక్తి సినిమాలకు ఉండే పవిత్రతను పాడు చేశారంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.






