ఫైనల్‌గా ‘జననాయగన్’ రిలీజ్‌పై అఫీషియల్ అప్డేట్.. పోలీస్ ఆఫీసర్‌గా విజయ్ లుక్ వైరల్

by Chukka Sudharani |   (  Updated:2026-07-15 12:36:27  IST  )

ఎట్టకేలకు ‘జననాయగన్’ సినిమా రిలీజ్‌కు రాబోతున్నది.

ఫైనల్‌గా ‘జననాయగన్’ రిలీజ్‌పై అఫీషియల్ అప్డేట్.. పోలీస్ ఆఫీసర్‌గా విజయ్ లుక్ వైరల్
X

దిశ, సినిమా: ఎట్టకేలకు ‘జననాయగన్’ సినిమా రిలీజ్‌కు రాబోతున్నది. కోలీవుడ్ స్టార్ హీరో, ప్రస్తుత తమిళనాడు సీఎం దళపతి విజయ్ హీరోగా, హెచ్. వినోత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా రిలీజ్ కావాలి. కానీ, సెన్సార్ సమస్యలతో ఈ మూవీ వాయిదా పడుతూనే వచ్చింది. విజయ్ సినీ కెరీర్‌కు ఇది లాస్ట్ సినిమా కావడంతో ‘జననాయగన్’ కోసం ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. పొలిటికల్ అండ్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా సెన్నార్ కంప్లీట్ చేసుకుని ‘A’ సర్టిపికేట్ సొంతం చేసుకుంది. దీంతో ఫైనల్‌గా ఈ సినిమా రిలీజ్‌పై అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు.. ‘పోరాటం ఎంత కఠినంగా ఉంటే.. విజయం అంత ఘనంగా ఉంటుంది’ అనే క్యాప్షన్‌తో అదిరిపోయే పోస్టర్‌ను షేర్ చేశారు మేకర్స్. అయితే.. రిలీజ్ చేసిన పోస్టర్‌లో విజయ్ పోలీస్ ఆఫీసర్‌గా సీరియస్ లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ విశేషంగా వైరల్ అవుతున్నది.

జన నాయగన్' ఓకే.. ఇప్పుడు 'టాక్సిక్' విషయంలో అదే జరగనుందా?

Next Story