జన నాయగన్' ఓకే.. ఇప్పుడు 'టాక్సిక్' విషయంలో అదే జరగనుందా?

by Pulgam srinivas |

'జన నాయగన్' చిత్రానికి సెన్సార్ బోర్డు 'A' సర్టిఫికెట్ జారీ చేయగా 'టాక్సిక్'పై ఇండస్ట్రీకి ఆసక్తి పెరిగింది.

జన నాయగన్ ఓకే.. ఇప్పుడు టాక్సిక్ విషయంలో అదే జరగనుందా?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం దక్షిణ భారత సినీ పరిశ్రమలో వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థల్లో కెవిన్ ప్రొడక్షన్స్ ఒకటి. ఈ సంస్థ తలపతి విజయ్ హీరోగా రూపొందిన 'జన నాయగన్' చిత్రాన్ని నిర్మించింది. తొలుత ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీని విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో సెన్సార్ ప్రక్రియలో తలెత్తిన అడ్డంకుల కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది. ఇటీవలే ఈ చిత్రానికి సెన్సార్ పూర్తికాగా బోర్డు 'A' సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో ఈ సినిమాను జూలై 24న విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు.

ఇక ఇదే నిర్మాణ సంస్థ కన్నడ స్టార్ హీరో యాష్ ప్రధాన పాత్రలో రూపొందించిన 'టాక్సిక్' చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది. ఈ సినిమా విడుదల తేదీ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడగా, తాజాగా ఆగస్టు 26న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలను బట్టి చూస్తే, ఈ మూవీలో భారీ యాక్షన్, రక్తపాతం, రొమాంటిక్ అంశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ చిత్రానికి కూడా సెన్సార్ బోర్డు నుంచి 'A' సర్టిఫికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే చివరికి ఈ సినిమాకు ఎలాంటి సర్టిఫికెట్ లభిస్తుందో వేచి చూడాలి.

Next Story