హైదరాబాద్‌‌లో రౌడీ షీటర్.. సంగారెడ్డిలో బాబా

by Ajay Maddhiboyina |

హైద‌రాబాద్‌లో పోలీసుల నుండి త‌ప్పించుకుని తిరుగుతున్న‌ ఓ రౌడీ షీట‌ర్ సంగారెడ్డిలో బాబా అవ‌తారం ఎత్తాడు. ఏడాదిగా రౌడీ షీట‌ర్ ఆచూకీ దొర‌క్క‌పోవ‌డంతో సీపీ స‌జ్జన్నార్ ఆదేశాల‌తో రంగంగ‌లోకి దిగిన ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంగారెడ్డిలో గుర్తించారు.

హైదరాబాద్‌‌లో రౌడీ షీటర్.. సంగారెడ్డిలో బాబా
X

దిశ‌, వెబ్ డెస్క్: హైద‌రాబాద్‌లో పోలీసుల నుండి త‌ప్పించుకుని తిరుగుతున్న‌ ఓ రౌడీ షీట‌ర్ సంగారెడ్డిలో బాబా అవ‌తారం ఎత్తాడు. ఏడాదిగా రౌడీ షీట‌ర్ ఆచూకీ దొర‌క్క‌పోవ‌డంతో సీపీ స‌జ్జన్నార్ ఆదేశాల‌తో రంగంగ‌లోకి దిగిన ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంగారెడ్డిలో గుర్తించారు. న‌కిలీ బాబాను గుర్తించ‌డంతో పాటు అత‌డి వ‌ద్ద 115 గ్రాముల గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. లేక్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని రౌడీ షీట‌ర్ మ‌హ్మ‌ద్ షేక్ జావేద్ గ‌తేడాది జూన్ నుండి పరారీలో ఉన్నాడు.

నిందితుడు సైఫాబాద్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో జ‌రిగిన ఓ హ‌త్య కేసులో ఏ5గా ఉండ‌గా అత‌డికి కోర్టు నాన్ బెయిల‌బుల్ వారెంజ్ చేసింది. అయితే అరెస్ట్ వారెంట్ నుండి త‌ప్పించుకునేందుకు నిందితుడు బాబా అవ‌తారం ఎత్తాడు. అత‌డిపై నిఘా పెట్టిన పోలీసులు సైఫాబాద్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని నానా మియా మ‌సీద్ స‌మీపంలో అదుపులోకి తీసుకున్నారు. ఇంత‌కాలం నిందితుడు సంగారెడ్డి జిల్లా చెరియాల్‌లో త‌న అమ్మ‌మ్మ వ‌ద్ద ఉంటూ ఓ మసీదులో పూజారిగా ప‌నిచేస్తున్న‌ట్టు గుర్తించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త వైరల్ అవ్వడంతో ఇన్నిరోజులు దొంగబాబాను నమ్మిన భక్తులు షాక్ అవుతున్నారు.

Next Story