- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిర్పూర్ (టి)లో పులి సంచారం కలకలం.. రెండు పశువులపై దాడి
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) మండలంలో పులి సంచారం కలకలం రేపింది.

X
దిశ, ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) మండలంలో పులి సంచారం కలకలం రేపింది. బుధవారం సిర్పూర్ (టి) హుడ్కిలి గ్రామ శివారు ప్రాంతంలో తెల్లవారుజామున పెద్దపులి రెండు పశువులపై దాడి చేసింది. ఈ ఘటనలో ఒక బర్రె దూడ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో బర్రె తీవ్రంగా గాయపడింది. స్థానికులు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనాస్థలంలో పులి పాదముద్రలను గుర్తించి.. దాడి పెద్దపులే చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. గాయపడిన పశువుకు చికిత్స చేపట్టారు. గ్రామ శివారు ప్రాంతంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు. పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. రాత్రి వేళల్లో అడవి ప్రాంతాలకు వెళ్లవద్దని.. పులి కనిపిస్తే అటవీ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
Next Story






