- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం సార్ బీరుకు రూ.10 ఎక్కువ తీసుకుంటున్నారు.. విజయ్‌కి యువకుడి ఫిర్యాదు
అవినీతిపై ఫిర్యాదు చేయాలని చెప్పిన తమిళనాడు సీఎం విజయ్ పిలుపుమేరకు ఓ యువకుడు ఆసక్తిరంగా స్పందించాడు. ప్రభుత్వ వైన్ షాపులో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని యువకుడు ఆరోపించాడు.

దిశ, వెబ్ డెస్క్: అవినీతిపై ఫిర్యాదు చేయాలని చెప్పిన తమిళనాడు సీఎం విజయ్ పిలుపుమేరకు ఓ యువకుడు ఆసక్తిరంగా స్పందించాడు. ప్రభుత్వ వైన్ షాపులో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని యువకుడు ఆరోపించాడు. బీరుకు అసలు ధర రూ.160 అని కానీ కూలింగ్ చార్జీల పేరుతో రూ.10 అదనంగా వసూలు చేస్తూ రూ.170కి అమ్ముతున్నారని చెప్పాడు. యువకుడు వైన్ షాపు ముందే వీడియో రికార్డు చేయగా షాపులోని సిబ్బంది అతడిని హెచ్చరిస్తున్నట్టు కనిపిస్తోంది. అయినప్పటికీ అతడు బయపడకుండా వీడియో తీస్తున్నానని ఫేస్ బుక్ లో పెడతానని వారితో వాదించాడు. ప్రభుత్వం సంబంధిత వైన్ షాపు లైసెన్స్ రద్దు చేయాలని యువకుడు డిమాండ్ చేశాడు.
అంతేకాకుండా వీడియోను సీఎం విజయ్ కి ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు తమదైన స్టైల్ లో స్పందిస్తున్నారు. ఇది కూడా అవినీతియేనా.. తాగడం మానేయండి ఆరోగ్యాలు కూడా బాగుంటాయ్ అంటూ కొందరు సూచిస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం ప్రభుత్వానికి ఎక్కువ ట్యాక్స్ కట్టేది తాగుబోతులేనని వారి సమస్యను కచ్చితంగా వెంటనే పరిష్కరించి ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి యువకుడు చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.






