క్రేజీ హీరోతో మురళీకిషోర్ అబ్బూరు కొత్త సినిమా

by Pulgam srinivas |   (  Updated:2026-07-15 09:02:17  IST  )

లెనిన్ మూవీ దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తన తదుపరి సినిమాను నానితో చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

క్రేజీ హీరోతో మురళీకిషోర్ అబ్బూరు కొత్త సినిమా
X

దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో ఓ దర్శకుడికి మంచి హిట్ పడిందంటే చాలు, ఆయన తదుపరి సినిమాకు సంబంధించి అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా 'లెనిన్' మూవీతో మురళీ కిషోర్ అబ్బూరు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈయన 'వినరో భాగ్యము విష్ణు కథ' చిత్రంతో దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించి తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నారు. ఇక 'లెనిన్' కూడా సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుండటంతో ఈ దర్శకుడి తదుపరి సినిమా ఎవరితో ఉండబోతుందనే ఆసక్తి సామాన్య సినీ ప్రేమికులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా నెలకొంది.

ప్రస్తుతం వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈ దర్శకుడు తన తదుపరి చిత్రాన్ని నేచురల్ స్టార్ నానితో చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నానికి ఓ కథను వినిపించినట్లు, దాదాపు ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం నాని 'ది ప్యారడైజ్' చిత్రంలో నటిస్తుండగా, 'బ్లడీ రోమియో' సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ Fire.. తిరుపతి ఎస్పీకి కంప్లైంట్

Next Story