- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్టీఆర్ ఫ్యాన్స్ Fire.. తిరుపతి ఎస్పీకి కంప్లైంట్
జూనియర్ ఎన్టీఆర్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై అభిమానులు సీరియస్ అయ్యారు. తిరుపతికి ఎస్సీని కలిసి కంప్లైంట్ చేశారు. రూ. 100 కోట్లతో ఎన్టీఆర్ సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నారని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు..

దిశ, వెబ్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్(Junior Ntr)పై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై అభిమానులు(Fans) సీరియస్ అయ్యారు. తిరుపతి(Tirupati)కి ఎస్సీని కలిసి కంప్లైంట్ చేశారు. రూ. 100 కోట్లతో ఎన్టీఆర్ సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నారని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలు చేసుకుంటున్నారని, ఎలాంటి రాజకీయాల్లోకి రావడంలేదని ఆయన కార్యాలయం నుంచి ప్రకటన విడులైనప్పటికీ కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పేరు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటివి చేయడం వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని, అటు ప్రజల్లో ఓ గందరగోళాన్ని సృష్టించారని, ఇకపై ఎన్టీఆర్‌పై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదని ఎన్టీఆర్ ఫ్యాన్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ కృష్ణ యాదవ్ హెచ్చరించారు.






