- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ క్రేజీ సంస్థ చేతికి స్పిరిట్ కర్ణాటక హక్కులు
స్పిరిట్ కర్ణాటక థియేట్రికల్ హక్కులను ఏసియన్ సినిమాస్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పిరిట్' అనే పవర్‌ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఉండటంతో ఇప్పటికే కర్ణాటక థియేట్రికల్ హక్కులను మేకర్స్ సెల్ చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కర్ణాటక థియేట్రికల్ హక్కులను ఏసియన్ సినిమాస్ సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. అలాగే ఈ సంస్థ కర్ణాటకలో సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇక తృప్తి దిమ్రి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, హర్షవర్ధన్ రాణే కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని టి-సిరీస్ ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.






