షర్ట్ బటన్స్ విప్పేసి క్యూట్ స్మైల్‌తో కట్టిపడేస్తున్న శరణ్య శెట్టి

by Pulgam srinivas |   (  Updated:2026-07-15 09:32:04  IST  )

ట్రెండీ అవుట్‌ఫిట్‌లో మెరిసిన శరణ్య శెట్టి.

షర్ట్ బటన్స్ విప్పేసి క్యూట్ స్మైల్‌తో కట్టిపడేస్తున్న శరణ్య శెట్టి
X

దిశ, వెబ్ డెస్క్: కన్నడ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి శరణ్య శెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది.

2021లో విడుదలైన 'హుట్టు హబ్బద శుభాషాయాలు' చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ శరణ్య శెట్టి ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన గ్లామరస్ ఫోటోషూట్‌లను అభిమానులతో పంచుకుంటూ ఆకట్టుకుంటోంది.

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన కొత్త ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో శరణ్య బ్లూ డెనిమ్ షర్ట్‌ను స్టైలిష్‌గా ధరించి, ట్రెండీ లుక్‌తో కెమెరాకు విభిన్న యాంగిల్స్‌లో పోజులిచ్చింది.

ముఖ్యంగా తన హెయిర్ స్టైల్, స్టైలింగ్, కాన్ఫిడెంట్ ఎక్స్‌ప్రెషన్స్ ఈ ఫోటోషూట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొత్తం మీద ఈ గ్లామరస్ లుక్‌లో శరణ్య శెట్టి అభిమానులను మరోసారి ఫిదా చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Photos Courtesy: Instagram

Next Story