- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజా సొమ్ము దుర్వినియోగం.. చెత్తకుప్పలో బతుకమ్మ చీరలు
బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు ప్రభుత్వం పంపిణీ చేయడానికి అందించిన చీరలు చెత్తకుప్పలో దర్శనమివ్వడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

దిశ, నల్లగొండ బ్యూరో : బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు ప్రభుత్వం పంపిణీ చేయడానికి అందించిన చీరలు చెత్తకుప్పలో దర్శనమివ్వడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమైందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మహిళలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం బతుకమ్మ చీరలను మున్సిపల్ అధికారులకు సరఫరా చేసింది. అయితే, ఆ చీరలు పంపిణీ చేయకుండా మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఓ స్టోర్‌రూమ్ పక్కన పెద్ద పెద్ద కట్టలుగా చెత్తకుప్పలో పడేసినట్లు గుర్తించారు. సుమారు 30 వేలకుపైగా చీరలు అక్కడ ఉన్నట్లు సమాచారం. మహిళల కోసం లక్షల రూపాయల ప్రజాధనంతో కొనుగోలు చేసిన చీరలు లబ్ధిదారులకు అందకుండా చెత్తకుప్పలో పడేయడం వల్ల ప్రభుత్వ ధనం వృథా అయినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ విషయం పై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






