- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముద్రగడ పాడె మోసిన జగన్
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాడెను మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మోశారు. అనంతరం పద్మనాభం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంతకుముందు పద్మనాభం భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు..

దిశ, వెబ్ డెస్క్: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాడెను మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మోశారు. అనంతరం పద్మనాభం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంతకుముందు పద్మనాభం భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ముద్రగడ కుటుంబ సభ్యులను పరిమర్శించి ధైర్యం చెప్పారు. కాగా ముద్రగడ పద్మనాభం గత ఎన్నికల్లో వైసీపీకి పూర్తి మద్దతు ప్రకటించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. కాపు సమస్యలు పరిష్కరించాలంటూ కిర్లంపూడిలో నిరసనలు కూడా కొనసాగించారు. ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని, అలా జరగని పక్షంలో ఇంటి పేరు ‘రెడ్డి’ అని పెట్టుకుంటానని సవాల్ విసిరారు.
ఇంటి పేరు మార్చుకున్న ముద్రగడ
కాగా ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముద్రగడ పద్మనాభం రెడ్డి అని కూడా పేరు మార్చుకున్నారు. అయితే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స కొనసాగించారు. కానీ పద్మనాభం మృతి చెందారు. దీంతో ముద్రగడ భౌతిక కాయాన్ని కాకినాడ జిల్లా కిర్లంపూడి నివాసంలో ప్రజల సదర్శనార్ధం ఉంచారు. కాపు నేతలు, వైసీపీ నాయకులు, పలు సంఘాలు, పార్టీ నేతలు ముద్రగడ భౌతిక కాయానికి నివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో ముద్రగడ అంత్యక్రియలు ముగిశాయి.






