- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్‌తో పోటీకి సిద్ధం అంటున్న కిరణ్ అబ్బవరం.. వెనక్కి తగ్గే ప్రసక్తి లేదంటూ కామెంట్స్
పోటీగా ఎంత పెద్ద సినిమాలు వచ్చినా తమ కంటెంట్‌పై మాకు గట్టి నమ్మకం ఉందని అన్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘చెన్నై లవ్ స్టోరీ’. శ్రీగౌరీ ప్రియ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామాను చెన్నై నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన తొలిప్రేమకథగా తీసుకురాబోతున్నారు. రవి నంబూరి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని కలర్ ఫొటో, బేబీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన నిర్మాతలు సాయి రాజేష్, ఎస్కేఎన్ నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీని జూలై 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర యూనిట్, నేడు కిరణ్ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రెస్‌మీట్‌ను నిర్వహించింది. అయితే, ఈ ప్రెస్‌మీట్‌లో కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. సరిగ్గా వీరు అనుకున్న డేట్‌కు ఒకరోజు ముందే, అంటే జూలై 23న కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న భారీ చిత్రం ‘జననాయగన్’ థియేటర్లలోకి రాబోతోంది.
విజయ్ రాజకీయాల్లోకి వెళ్తున్న నేపథ్యంలో ఆయన కెరీర్‌లో ఇదే చివరి సినిమా కావడంతో దీనిపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నిజానికి సంక్రాంతికే విడుదల కావాల్సి ఉన్నా, సెన్సార్ ఇబ్బందుల వల్ల వాయిదా పడుతూ వచ్చి ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్ అవుతోంది. విజయ్ వంటి పెద్ద స్టార్ సినిమా పోటీగా వస్తుండటంతో ‘చెన్నై లవ్ స్టోరీ’ వెనక్కి తగ్గుతుందని, విడుదల వాయిదా పడుతుందని అందరూ భావించారు. ఇదే విషయంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా కిరణ్ అబ్బవరం ఎంతో కాన్ఫిడెంట్‌గా స్పందించారు. పోటీగా ఎంత పెద్ద సినిమాలు వచ్చినా తమ కంటెంట్‌పై మాకు గట్టి నమ్మకం ఉందని అన్నారు. డేట్ మార్చే ప్రసక్తే లేదు, వెనక్కి తగ్గే అవకాశమే లేదని.. చెప్పిన తేదీకే థియేటర్లలోకి వస్తున్నాం అని తేల్చి చెప్పారు. అంతేకాకుండా, తమ వెనుక ఎస్కేఎన్, సాయి రాజేష్, ధీరజ్ లాంటి సాలిడ్ ప్రొడక్షన్ పర్సనాలిటీస్ ఉన్నారని.. అందువల్ల తమకు థియేటర్ల కొరత గానీ, ఓపెనింగ్స్ టెన్షన్ గానీ అస్సలు లేవంటూ కిరణ్ అబ్బవరం ధీమా వ్యక్తం చేశారు. పెద్ద సినిమా పోటీగా ఉన్నా యంగ్ హీరో చూపించిన ఈ కాన్ఫిడెన్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.






