- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్‌కు హైకోర్టులో రిలీఫ్.. GHMC నోటీసులపై స్టేటస్ కో విధింపు

దిశ, వెబ్‌డెస్క్: హుస్సేన్‌సాగర్ ఎఫ్‌టీఎల్ (FTL)లో నిర్మాణాలు చేపట్టారని జీహెచ్‌ఎంసీ (GHMC) నోటీసులు జారీ చేసిన వ్యవహారంలో ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. జీహెచ్‌ఎంసీ అధికారులు తమకు జారీ చేసిన షోకాజ్ నోటీసులను చట్టవిరుద్ధంగా పేర్కొంటూ సదరు నిర్మాణ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, ఆ పిటిషన్‌పై ఇవాళ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. జీహెచ్‌ఎంసీ జారీ చేసిన షోకాజ్ నోటీసులపై తదుపరి విచారణ ముగిసే వరకు యథాతథ స్థితి (Status Quo) కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు సదరు నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, ప్రస్తుత పరిస్థితినే కొనసాగించాలని స్పష్టం చేసింది.
అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి సమగ్ర వివరాలతో కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వరకు యథాతథ స్థితి ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేస్తూ న్యాయస్థానం కేసు విచారణను వాయిదా వేసింది.






