- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుర్తు తెలియని వాహనం ఢీ.. ఇద్దరు యువకులు మృతి
నిజాంసాగర్ మండలం వడ్డేపల్లి శివారులోని కంకర క్రషర్ మిషన్ సమీపంలోని మూల మలుపు వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు.

దిశ, నిజాంసాగర్: నిజాంసాగర్ మండలం వడ్డేపల్లి శివారులోని కంకర క్రషర్ మిషన్ సమీపంలోని మూల మలుపు వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. దినకర్మ సామాగ్రి తీసుకొని ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోర్గల్ గ్రామానికి చెందిన జుంజురు దినేష్ (26), జుంజురు రమేష్ (24) దినకర్మ సామాగ్రి తీసుకుని బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో వడ్డేపల్లి శివారులోని కంకర క్రషర్ మిషన్ సమీపంలోని మూల మలుపు వద్ద ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం వారి బైక్‌ను బలంగా ఢీకొట్టింది.
దీంతో బైక్ అదుపుతప్పి రోడ్డు పై పడిపోయింది. ఈ ప్రమాదంలో జుంజురు దినేష్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన జుంజురు రమేష్‌ను తొలుత ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బాన్సువాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అతను కూడా మృతి చెందినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై శివకుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ప్రమాదానికి కారణమైన గుర్తు తెలియని వాహనం కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా, హైదరాబాద్ నుంచి ఎల్లారెడ్డి వైపు వెళ్తున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రమాద స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.






