- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండాలి
అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచించారు.

దిశ, షాద్‌నగర్ : అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచించారు. ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను అధికారులు సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేయాలని కోరారు. బుధవారం షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 12, 13, 14 వార్డులతో పాటు 227, 228, 231, 234 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లతో మాట్లాడి ఎన్యూమరేషన్ ఫారాల నమోదు, వివరాల పరిశీలన, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాదని పేర్కొన్నారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకుని ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. అధికారులు, బీఎల్ఓలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని, అపోహలకు తావివ్వకుండా ఎన్నికల సంఘం సూచనలను ప్రజలు అనుసరించాలని సూచించారు.
మౌలిక వసతుల కల్పనకే ప్రాధాన్యం....
షాద్‌నగర్ మున్సిపాలిటీ అభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ప్రజలకు అవసరమైన రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. పట్టణంలోని 12వ వార్డులో కౌన్సిలర్ కళ్యాణ్‌కార్ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో రూ.10 లక్షల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బుధవారం శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో షాద్‌నగర్ పట్టణం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొంటూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధులు మంజూరు చేసి నాణ్యమైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందే మోహన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, కౌన్సిలర్లు రిజ్వానా బేగం, ముబారక్ అలీ ఖాన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీధర్, కో-ఆప్షన్ సభ్యుడు ఖదీర్, ఫరూక్‌నగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్, బీఎల్ఓలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.






