ప్రభాస్ దగ్గర తీసుకోవడానికి అదొక్కటి తప్ప ఇంకేం లేదు: పూజా హెగ్డే

by Mallepaka Hamsa |

నాకు తెలిసి 'రాధేశ్యామ్' షూటింగ్ సమయం నుండి నాకు ప్రధానంగా గుర్తుండిపోయేది కేవలం భోజనం మాత్రమే.

ప్రభాస్ దగ్గర తీసుకోవడానికి అదొక్కటి తప్ప ఇంకేం లేదు: పూజా హెగ్డే
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్, బుట్టబొమ్మ పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వచ్చిన పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా ‘రాధేశ్యామ్’. 2022లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక డిజాస్టర్‌గా నిలిచింది. అయితే, సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ఆ షూటింగ్ సమయంలో తనకు మిగిలిన తీపి జ్ఞాపకాలను పూజా హెగ్డే తాజాగా గుర్తు చేసుకున్నారు. షూటింగ్ రోజుల్లో ప్రభాస్ సెట్స్‌లో చూపించే ఆతిథ్యం, ఆయన పెట్టే భోజనం గురించి ఆమె మాట్లాడారు. "నాకు తెలిసి 'రాధేశ్యామ్' షూటింగ్ సమయం నుండి నాకు ప్రధానంగా గుర్తుండిపోయేది కేవలం భోజనం మాత్రమే. ప్రభాస్ రోజు నాకు ఎంతో రుచికరమైన వంటకాలతో పంపించే క్యారేజ్ డబ్బాలను నేను అస్సలు మర్చిపోలేను" అని చెప్పారు.

ప్రభాస్ దగ్గర నుంచి మీరు ఏదైనా దొంగిలించాలనుకుంటే ఏం దొంగిలిస్తారు? అని యాంకర్ అడగగా.. "నాకు గనుక అవకాశం వస్తే నేను ప్రభాస్ వంటవాడిని దొంగిలిస్తాను. ప్రభాస్ దగ్గర నుంచి నేను దొంగిలించాలనుకునేది, తీసుకోవాలనుకునేది అది ఒక్కటే! ఆయన దగ్గర నుంచి తీసుకోవడానికి అంతకంటే ఇంకేమీ లేదు" అంటూ నవ్వుతూ చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. పూజా హెగ్డే సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘జననాయగన్’ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దీంతో పాటు ఆమె మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరసన ‘శ్రీ శ్రీ’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను రవి నెలకుదితి తెరకెక్కిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రాబోతోంది.

Next Story