చీరలో ఫారియా అబ్దుల్లా గ్లామర్ ట్రీట్.. అందాలకు ఫ్యాన్స్ ఫిదా

by Pulgam srinivas |

గోల్డెన్ చీరలో మెరిసిపోయిన ఫారియా అబ్దుల్లా.

చీరలో ఫారియా అబ్దుల్లా గ్లామర్ ట్రీట్..  అందాలకు ఫ్యాన్స్ ఫిదా
X

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నటి ఫారియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'జాతిరత్నాలు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ, తొలి చిత్రంతోనే సూపర్ హిట్‌తో పాటు మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.




ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ, తొలి సినిమా స్థాయి విజయాన్ని మాత్రం ఇప్పటివరకు అందుకోలేకపోయింది. అయినప్పటికీ హీరోయిన్ పాత్రలతో పాటు ప్రాధాన్యమున్న ఇతర పాత్రలను కూడా ఎంపిక చేసుకుంటూ తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తోంది.




సినిమాల్లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఫారియా సోషల్ మీడియాలోనూ అదే జోరు కొనసాగిస్తోంది. ఎప్పటికప్పుడు స్టైలిష్ ఫోటోషూట్లతో అభిమానులను అలరిస్తూ వస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.




ఈ ఫోటోల్లో ఫారియా గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్‌తో ఆకట్టుకునే చీరను ధరించి మెరిసిపోయింది. దానికి మ్యాచ్ అయ్యే స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో గ్లామర్ టచ్ జోడించింది. స్టైలిష్ పోజులు, సింపుల్ జ్యువెలరీ, చేతికి ఉంగరం, అందమైన ఇయర్‌రింగ్స్, గాలికి ఎగిరే జుట్టు ఆమె లుక్‌ను మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి.




మొత్తం అవుట్‌ఫిట్‌లో ఫారియా ఎంతో స్టైలిష్‌గా, ఆకర్షణీయంగా కనిపిస్తుండటంతో ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి.

Next Story