- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HMDA చీఫ్ ఇంజినీర్ రవీందర్‌కు రిమాండ్.. జైలుకు తరలింపు
హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) చీఫ్ ఇంజినీర్ రవీందర్‌కు ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఆయనను కోర్టు ముందు హాజరుపరచారు..

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) చీఫ్ ఇంజినీర్ రవీందర్‌కు ఏసీబీ ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఆయనను కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఇరువర్గాల వాదనలు విన్న జడ్జి ఈ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం రవీందర్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
నివాసాలు, కార్యాలయాల్లోనూ తనిఖీలు
ఇటీవల రవీందర్ నివాసాలు, కార్యాలయాలు, అలాగే ఆయన బంధువులకు చెందిన పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ తనిఖీల్లో భారీగా అక్రమ ఆస్తులు, నగదు, బంగారు ఆభరణాలు, కీలక దస్త్రాలను గుర్తించారు. అనంతరం స్వాధీనం చేసుకున్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అంతేకాదు కీలకమైన ఆధారాలు లభించాయి. దీంతో ఆయనను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
మరింత సమాచారం రాబట్టేందుకు..
అయితే రవీందర్ నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే యోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరు సూత్రధారుల వివరాలు సేకరించేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు.






