- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం చంద్రబాబుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ప్రభుత్వ హయాంలో అమరావతి అసైన్డ్ భూముల బదిలీ వ్యవహారంలో నమోదైన సీఐడీ (CID) కేసును హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ఇదే కేసులో మంత్రి నారాయణకు కూడా బిగ్ రిలీఫ్ లభించింది. వీరిద్దరిపై నమోదైన ఈ కేసును న్యాయస్థానం స్క్వాష్ చేసింది.
కేసు నేపథ్యం
గత వైకాపా ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టం (POT Act) ఉల్లంఘనలు జరిగాయంటూ, వివిధ ఐపీసీ (IPC) సెక్షన్ల కింద చంద్రబాబు, నారాయణలపై సీఐడీ అధికారులు అప్పట్లో కేసు నమోదు చేశారు. రాజధాని ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్నది ఆ కేసులో ప్రధాన ఆరోపణ. ఈ కేసుపై సుదీర్ఘంగా జరిగిన విచారణ అనంతరం, రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తగిన ఆధారాలు లేకుండా ఈ కేసు నమోదు చేశారన్న డిఫెన్స్ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. సీఐడీ నమోదు చేసిన సదరు కేసును పూర్తిగా క్వాష్ చేస్తూ న్యాయమూర్తి తుది తీర్పు వెలువరించారు.
కూటమిలో పొలిటికల్ జోష్
హైకోర్టు ఇచ్చిన ఈ క్లీన్ చిట్ తీర్పు కూటమి ప్రభుత్వ వర్గాల్లో జోష్ నింపింది. రాజధాని అమరావతి నిర్మాణ ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరిగిందని, గత ప్రభుత్వం కావాలనే తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూసిందని ఈ తీర్పు ద్వారా రుజువైందని టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.






