- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్తూరులో అగ్నిప్రమాదం..
by Kodari Anjali |
గోదాంలో నిల్వచేసిన గడ్డివాములో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.

X
దిశ, షాద్ నగర్: గోదాంలో నిల్వచేసిన గడ్డివాములో ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు పక్కనే ఉన్న పైపుల గోదాముకు వ్యాపించడంతో కొత్తూరు మున్సిపాలిటీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కొత్తూరుకు చెందిన బాబూలాల్ గోదాంలో నిల్వ ఉంచిన గడ్డివాముకు బుధవారం ఒక్కసారిగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న పైపుల గోదాంను చుట్టుముట్టాయి. దీంతో ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకొంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






