తోపులాట.. జగన్ కు తప్పిన భారీ ప్రమాదం

by Muthe.Rajitha |

మాజీ ముఖ్యమంత్రి, YSRCP అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భారీ ప్రమాదం తప్పింది.

తోపులాట.. జగన్ కు తప్పిన భారీ ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భారీ ప్రమాదం తప్పింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన 'ఆక్వా రైతుల ముఖాముఖి' బహిరంగ సభలో ఈ అపశ్రుతి చోటుచేసుకుంది. వైఎస్ జగన్ సభా వేదికపైకి వస్తున్న సమయంలో, ఆయనను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు ఒక్కసారిగా ముందుకు దూసుకువచ్చారు. దీంతో అక్కడ భారీ తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో బ్యారికేడ్ల ఒత్తిడికి జగన్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి కింద పడబోయారు. అయితే, ఆయన వెనుకే ఉన్న వ్యక్తిగత భద్రతా సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి, జగన్ కింద పడకుండా గట్టిగా పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. ఆ తర్వాత భద్రతా సిబ్బంది జనాలను నియంత్రించి ఆయనను వేదికపైకి తీసుకెళ్లారు.

కూటమి ప్రభుత్వంపై జగన్ ఫైర్

ఆక్వా రైతుల ముఖాముఖి సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలోని ఆక్వా రైతులను చంద్రబాబు ప్రభుత్వం నట్టేటా ముంచుతోందని ఆరోపించారు. ధరల స్థిరీకరణ, విద్యుత్ రాయితీలు ఇవ్వకుండా ఆక్వా రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నారని ఆయన విమర్శించారు.

Next Story