తార్నాకలో బీజేపీ నేత కారుపై దాడి

by Ratna Kumari |

తార్నాక స్ట్రీట్ నంబర్–3లో బీజేపీ నాయకుడు డా. శ్రీరామ్ వెంకటేశ్ కారుపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి సన్‌రూఫ్ అద్దాన్ని ధ్వంసం చేశారు.

తార్నాకలో బీజేపీ నేత కారుపై దాడి
X

దిశ, సికింద్రాబాద్ : తార్నాక స్ట్రీట్ నంబర్-3లో బీజేపీ నాయకుడు డా.శ్రీరామ్ వెంకటేశ్ కారుపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి సన్‌రూఫ్ అద్దాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై డా.శ్రీరామ్ వెంకటేశ్ స్పందిస్తూ.. తార్నాక ప్రాంతంలో పార్కుల పరిరక్షణ, కాలనీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న సమయంలో విమర్శలు, అపోహలు, వ్యక్తిగత ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. తన కారుపై జరిగిన దాడి బాధాకరమైనదేనని, అయితే ఇలాంటి చర్యలు తన సంకల్పాన్ని మరింత బలపరుస్తాయని పేర్కొన్నారు.

"రాళ్లు విసిరితే వెనక్కి తగ్గేవాడిని అయితే ప్రజాసేవలోకి వచ్చేవాడిని కాదు. విమర్శలు, అడ్డంకులు ప్రజల కోసం మరింతగా పనిచేయాలనే పట్టుదలను పెంచాయి. ధర్మం ఆలస్యమైనా గెలుస్తుంది.. సత్యం నిదానమైనా నిలుస్తుంది" అని ఆయన వ్యాఖ్యానించారు. ఘటన విషయం తెలిసిన వెంటనే సికింద్రాబాద్ అసెంబ్లీ బీజేపీ మాజీ అభ్యర్థి మేకల సారంగపాణి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకటేష్ గౌడ్ తదితరులు డా. శ్రీరామ్ వెంకటేశ్ నివాసానికి వెళ్లి పరామర్శించి సంఘీభావం తెలిపారు.

Next Story