ఠాణాకు చేరిన మత్తు కార్యదర్శి

by Batti.Sumithra |

కారేపల్లి మండలంలోని గంగారం తండా గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి నిత్యం మద్యం సేవించి విధులకు హాజరవ్వడమే కాకుండా ఏకంగా సర్పంచ్ పైన, గ్రామస్తుల పైన చిందులు వేసి కారేపల్లి పోలీసు స్టేషన్ కు చేరిన విషయం మండలంలో కలకలం రేపుతోంది.

ఠాణాకు చేరిన మత్తు కార్యదర్శి
X

దిశ, కారేపల్లి : కారేపల్లి మండలంలోని గంగారం తండా గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి నిత్యం మద్యం సేవించి విధులకు హాజరవ్వడమే కాకుండా ఏకంగా సర్పంచ్ పైన, గ్రామస్తుల పైన చిందులు వేసి కారేపల్లి పోలీసు స్టేషన్ కు చేరిన విషయం మండలంలో కలకలం రేపుతోంది. ఇదే విషయమై సర్పంచ్ కిరణ్ పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఆయన ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రావడం లేదని గ్రామస్తులు తెలిపారు. బుధవారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్‌తో కార్యదర్శి దురుసుగా ప్రవర్తించాడని గ్రామస్తులు ఆయనను కారేపల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం పోలీసులు ద్విచక్ర వాహనం పై వచ్చిన కార్యదర్శిని డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆధారంగా కార్యదర్శి పై పోలీసులకు, సంబంధిత శాఖ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు సర్పంచ్ కిరణ్ తెలిపారు. ఘటన పై పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది.

మండల అధికారుల చర్యలు లేకనే..

గ్రామపంచాయతీ కార్యదర్శి గ్రామ పాలనలో కీలక బాధ్యతలు నిర్వహించే అధికారి. ప్రజల సమస్యలు పరిష్కరించడం, అభివృద్ధి పనులను పర్యవేక్షించడం, ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేయడం ఆయన బాధ్యత. అలాంటి అధికారి విధుల సమయంలో మద్యం సేవించి వస్తున్నారనే ఆరోపణలు గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళనకు దారితీశాయి. సమగ్ర విచారణ చేపట్టి అధికారి పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. గతంలో పంచాయతీ కార్యదర్శి ప్రవర్తన తీరుపై పలుమార్లు మండల పంచాయతీ అధికారి దృష్టికి తీసుకెళ్లిన కార్యదర్శి పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, కార్యదర్శి ప్రవర్తనలో మార్పు రావడంలేదని గ్రామస్తులు వాపోతున్నారు.

మండల ఎంపీఓ రవీంద్ర ప్రసాద్ వివరణ కోరగా : గంగారం తండా గ్రామపంచాయతీ సర్పంచ్ కిరణ్ ఫిర్యాదు ఇచ్చింది వాస్తవమే త్రాగి వచ్చిదురుసుగా ప్రవర్తించాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి డిపిఓ కు నివేదిక సమర్పిస్తామని తెలిపారు.

Next Story