- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్తను హత్య చేసిన భార్య.. ప్రియుడు అరెస్ట్
నల్లగొండ జిల్లా వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించి, మృతుడి భార్యతో పాటు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు.

దిశ, మిర్యాలగూడ రూరల్ : నల్లగొండ జిల్లా వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించి, మృతుడి భార్యతో పాటు ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను పథకం ప్రకారం హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మిర్యాలగూడ రూరల్ సీఐ పీఎన్డీ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన ఇస్లావత్ గోవిందు ఈ నెల 11న తన నివాసంలో మృతి చెందిన ఘటన పై వాడపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని శాస్త్రీయంగా పరిశీలించిన పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించి, పోస్టుమార్టం నివేదికతో పాటు సాంకేతిక ఆధారాల పై విచారణ కొనసాగించారు. దర్యాప్తులో గోవిందు భార్య ఇస్లావత్ సరోజకు అదే గ్రామానికి చెందిన చెన్నబోయిన శ్రీనుతో గత ఆరు సంవత్సరాలుగా అక్రమ సంబంధం ఉన్నట్లు తేలింది. ఈ విషయం తెలిసిన గోవిందు భార్యను తరచూ నిలదీయడం, ఇటీవల ఆమె మొబైల్ ఫోన్‌ను ధ్వంసం చేయడంతో ఇద్దరి మధ్య విభేదాలు మరింత పెరిగినట్లు పోలీసులు గుర్తించారు.
దీంతో గోవిందును హత్య చేయాలని సరోజ, శ్రీను కలిసి ముందస్తు ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడైంది. ఈ నెల 10, 11 తేదీల అర్ధరాత్రి సమయంలో శ్రీను ఇంట్లోకి ప్రవేశించి గోవిందు ముఖంపై దిండు పెట్టి శ్వాస ఆడకుండా బలంగా అదిమిపట్టగా, సరోజ అతని కాళ్లను గట్టిగా పట్టుకుంది. గోవిందు ప్రతిఘటించడంతో శ్రీను పిడిగుద్దులతో దాడి చేయగా, సరోజ ఇంట్లో ఉన్న చెక్క రోకలి బండతో వృషణాలపై బలంగా కొట్టింది. తీవ్ర గాయాలతో గోవిందు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నేరం అనంతరం నిందితులు రక్తపు మరకలు ఉన్న దుస్తులు, హత్యకు ఉపయోగించిన వస్తువులను దాచిపెట్టి పరారయ్యారు. సాంకేతిక ఆధారాలు, విచారణలో లభించిన సమాచారంతో ఈ నెల 14న దామరచర్ల శివారులోని రైల్వే గేట్ సమీపంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన చెక్క రోకలి బండ, రక్తపు మరకలు ఉన్న దుస్తులు, నోకియా కీప్యాడ్ సెల్‌ఫోన్, రెడ్‌మీ–12 మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు. మిర్యాలగూడ డీఎస్పీ పర్యవేక్షణలో కేసును విజయవంతంగా ఛేదించిన వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి సిబ్బంది జోజి జహీరుద్దీన్ హరినాథ్ మధు ఉదయ్ పూర్ణిమ చౌడమ్మ లను ఎస్పీ అభినందించారు.






