- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి : కొనసాగుతున్న సహాయక చర్యలు
ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మమురా అనే గ్రామంలో ఓ ఎలక్ట్రిక్ స్కూటీలో మంటలు చెలరేగగా.. అవి క్రమంగా ఆ భవనమంతా వ్యాపించాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మమురా అనే గ్రామంలో ఓ ఎలక్ట్రిక్ స్కూటీలో మంటలు చెలరేగగా.. అవి క్రమంగా నాలుగు అంతస్తుల భవనమంతా వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు చూసి నివాసితులు ఆందోళనకు గురయ్యారు. కాపాడాలంటూ ఆర్తనాదాలు చేయగా.. చుట్టుపక్కల స్థానికులు అప్రమత్తమయ్యారు. కిందినుంచి బయటికి వచ్చే వీలులేకపోవడంతో.. భవనం పై అంతస్తు నుంచి పక్కనే ఉన్న మరో భవనం పైకి నిచ్చెన కర్రలను వేసి.. బాధితులను రక్షిస్తున్నారు. దాదాపు 50 మంది భవనంలో చిక్కుకోగా.. ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. పలువురికి గాయాలవ్వగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. భారీ ఎత్తున మంటలు ఎగసిపడటంతో.. భవనం నుంచి నల్లటి పొగ వెలువడుతోంది. ప్రస్తుతం ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి.






