- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేధింపులపై కుటుంబం ఆవేదన.. గ్రామ పంచాయతీ ఎదుట నిరసన
తమ భూమి విషయంలో వేధింపులు చేస్తున్నారంటూ ఎస్టీ కుటుంబం గ్రామపంచాయతీ ముందు పురుగుల మందు, పెట్రోల్ డబ్బాతో నిరసన చేపట్టింది.

దిశ, గన్నేరువరం: తమ భూమిని ప్రభుత్వ భూమి అంటూ సర్పంచ్ ఇద్దరు వార్డు మెంబర్లు వేధింపులకు గురి చేస్తున్నారంటూ బుధవారం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన ఎస్టి కులానికి చెందిన కుర్ర హరీష్ తమ కుటుంబ సభ్యులతో కలిసి గ్రామపంచాయతీ ముందు పురుగుల మందు పెట్రోల్ డబ్బాతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాధితుడు హరీష్ మాట్లాడుతూ.. ఊరి చివరన 12 గుంటలలో తమ తాతల కాలం నుండి ఇల్లు కట్టుకొని జీవిస్తున్నామని, తమకు పట్ట డాక్యుమెంట్స్ ఉన్న గ్రామ సర్పంచ్ రంగన వేణి లచ్చినర్సు, కార్యదర్శితో పాటు మరో ఇద్దరు వార్డు మెంబర్లు కలిసి తమ భూమిలో నుంచి మూడు గంటల భూమిని వివో బిల్డింగ్ కు ఇవ్వాలంటూ తమ కుటుంబాన్ని తరచూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు . అధికారులకు చెప్పిన ఎవరు పట్టించుకోవడం లేదని వాపోయాడు. వేధింపులు ఆపకపోతే తను ఆత్మహత్య చేసుకుంటానని తన చావుకు సర్పంచ్ నచ్చినర్సు, గ్రామ కార్యదర్శి ఇద్దరు వార్డు మెంబర్లు కారణం అవుతారని తెలిపాడు. ఈ విషయంపై సర్పంచ్ లచ్చి నర్సును వివరణ కోరగా ప్రభుత్వ భూమిని పరిరక్షిస్తూ అధికారుల సూచన మేరకు చర్యలు తీసుకుంటున్నామే తప్ప ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని అన్నారు.






