- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కిష్టాపురంలో గుడుంబాపై పోలీసుల దాడి..
అక్రమ గుడుంబా తయారీ, విక్రయాలపై తొర్రూరు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

దిశ, తొర్రూరు: అక్రమ గుడుంబా తయారీ, విక్రయాలపై తొర్రూరు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు మండలంలోని కిష్టాపురం గ్రామంలో బుధవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కిరేకంటి యాకమ్మ ఇంటి వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన 6 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోవడంతో పాటు, గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 350 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిందితురాలిపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు తొర్రూరు ఎస్‌ఐ మహేందర్ రెడ్డి తెలిపారు. అలాగే నిందితురాలిని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చి బైండ్ ఓవర్ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అక్రమంగా గుడుంబా తయారీ, విక్రయాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని ఎస్‌ఐ సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు. అక్రమ మద్యం నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.






