Thamareddy Bharadwaj: అనిల్ రావిపూడికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు

by Pulgam srinivas |

తాను ఆహ్వానించగానే 'వదలా' మూవీ ఈవెంట్‌కు అనిల్ రావిపూడి వచ్చారని తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడించారు.

Thamareddy Bharadwaj: అనిల్ రావిపూడికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు చిత్రసీమలో ప్రముఖ నిర్మాతగా గుర్తింపు పొందిన తమ్మారెడ్డి భరద్వాజ ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినిమాలు నిర్మించకపోయినా, అప్పుడప్పుడు మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా ఆయన నిర్మించిన 'వదలా' చిత్రంలో జగపతిబాబు, లయ ప్రధాన పాత్రలు పోషించారు. ఆకెళ్ల వి. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హృతికా శ్రీనివాస్, శ్రీనివాస్ అవసరాల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కార్తీక్ బి. కొడకండ్ల సంగీతం అందించిన ఈ చిత్రం జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమా విడుదల తేదీ సమీపిస్తుండటంతో ఇటీవల చిత్రబృందం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనిల్ రావిపూడి స్టార్ డైరెక్టర్ అయిన తర్వాత కూడా తన మాట నిలబెట్టుకున్నారు. ఒకప్పుడు 'సార్.. మీ సినిమా ఈవెంట్ ఉంటే తప్పకుండా వస్తానుని చెప్పారు. ఈ సినిమా ఈవెంట్‌కు ఆయనను ఆహ్వానించాలని అనుకున్నప్పుడు, స్టార్ డైరెక్టర్ అయ్యారు కాబట్టి వస్తారో లేదో అనే సందేహం కలిగింది.

అయినా ఒకసారి ఫోన్ చేశాను. మొదట ఆయన ఫోన్ ఎత్తలేదు. దాంతో కావాలనే ఫోన్ లేపలేదేమో అనుకున్నాను. అయితే అదే రోజు సాయంత్రం ఆయనే తిరిగి ఫోన్ చేసి, 'సార్.. ఫోన్ చేశారు, ఏమైంది?' అని అడిగారు. విషయం చెప్పగానే వెంటనే వస్తానని చెప్పారు. చెప్పినట్లుగానే ఈవెంట్‌కు హాజరయ్యారు. ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ప్రస్తుతం తమ్మారెడ్డి భరద్వాజ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story