- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేట్ పాఠశాలలపై తనిఖీలు ఏవి...?
నిత్యం పాఠశాలలు, కళాశాలల స్కూల్ బస్సులు, ఆటోలపై నిఘా ఉంచాల్సిన ఆర్టీవో అధికారులు మచ్చుకైనా కానరావడం లేదు.

దిశ, మణుగూరు: నిత్యం పాఠశాలలు, కళాశాలల స్కూల్ బస్సులు, ఆటోలపై నిఘా ఉంచాల్సిన ఆర్టీవో అధికారులు మచ్చుకైనా కానరావడం లేదు. ప్రైవేట్ పాఠశాలలు కళాశాలల బస్సులకు, ఆటోలకు ఫిట్ నెస్ ఉందా లేదా అనేది అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా విద్యార్థులను ఎంత పరమతిలో ఎక్కించాలి అనే నిబంధనలు ఉన్నాయి. కానీ ఆ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. అయినా సరే వారిపై ఎలాంటి చర్యలు ఉండవు. బస్సుల్లో, ఆటోల్లో పరిమితికి మించి విద్యార్థులకు పాఠశాలలకు తరలిస్తున్నారు. ఆ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు ఊహించని విధంగా నష్టం జరుగుతుంది.
ప్రమాదాలు జరిగినప్పుడే తనిఖీలు నిర్వహిస్తారా..
అయినా సరే ఇవేమీ పట్టకుండా పాఠశాలల యాజమాన్యాలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఎవరు ఎన్నిసార్లు చెప్పినా వారి పద్ధతిలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. పాఠశాలలకు విద్యార్థులను తీసుకువెళ్లే ఆటోలకు అసలు నెంబర్ ప్లేట్లే లేవు. ఇవన్నీ ఆర్టీవో అధికారులకు కనిపించడం లేదా అని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడే తనిఖీలు నిర్వహిస్తారా అంటూ పలువురు మండిపడుతున్నారు. నిత్యం తనిఖీలు నిర్వహించాల్సిన ఆర్టీవో అధికారులు ఇటువైపు కూడా కన్నెత్తి చూడటం లేదు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు విద్యార్థుల ఫీజులపై ఉన్న మక్కువ వారి రక్షణ పై ఉండదా. ఆర్టీవో అధికారులు తనిఖీలు ఎందుకు నిర్వహించడం లేదు... ఇటువైపు కన్నెత్తి చూడక పోవడానికి కారణాలేమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత ఆర్టీవో అధికారులు తనిఖీలు నిర్వహించాలని, పరిమితికి మించి విద్యార్థులని ఎక్కించకుండా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.






