చిత్రపరిశ్రమలో తీవ్రవిషాదం.. ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి మృతి

by Ajay Maddhiboyina |   (  Updated:2026-05-05 14:55:25  IST  )

చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర‌విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ నిర్మాత ఆర్.బీ చైద‌రి మృతిచెందారు. ఉద‌య్ పూర్ లో జరిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఆర్.బీ చౌద‌రి మ‌ర‌ణించారు.

చిత్రపరిశ్రమలో తీవ్రవిషాదం.. ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి మృతి
X

దిశ‌, వెబ్ డెస్క్: చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర‌విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ నిర్మాత ఆర్.బీ చౌద‌రి(Super Good Films chief RB Chowdhury) మృతిచెందారు. రాజస్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఆర్.బీ చౌద‌రి(Producer RB Chowdhury) మ‌ర‌ణించారు. సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ‌ను స్థాపించి ఈయ‌న ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల‌ను నిర్మించారు. తెలుగుతో పాటు హిందీ, త‌మిళం, మ‌ల‌యాళం భాష‌ల్లో దాదాపు 100 సినిమాల వ‌ర‌కు నిర్మించారు. విజయ్ కెరీర్ తొలినాళ్లలో, ఆయనతో కలిసి 'పూవే ఉనక్కాగ' (1996), 'లవ్ టుడే' (1997), 'తుళ్ళాత మనముమ్ తుళ్ళుమ్' (1999), 'షాజహాన్' (2001), 'తిరుపాచ్చి' (2005) మరియు 'జిల్లా' (2014) లాంటి అనేక మాస్ సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. తెలుగులో క్లాసిక్ హిట్స్ గా నిలిచిన రాజా, నువ్వొస్తావని, సంక్రాంతి, సూర్యవంశం, నవవసంతం లాంటి చిత్రాలను సైతం ఈయనే నిర్మించారు.

Read More.. సినీ గేయ రచయిత చంద్రబోస్‌ సోదరుడి మృతిపై అనుమానాలు

Next Story