- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినీ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడి మృతిపై అనుమానాలు
సినీ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందడం అనుమానాలకు దారితీస్తోంది. చంద్రబోస్ సోదరుడు రాజేందర్ 60 అన్నమయ్య జిల్లా కలికిరి రోడ్డుపై మృతి చెంది ఉన్నారు.

దిశ, వెబ్ డెస్క్: సినీ గేయ రచయిత చంద్రబోస్ సోదరుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందడం అనుమానాలకు దారితీస్తోంది. చంద్రబోస్ సోదరుడు రాజేందర్ 60 అన్నమయ్య జిల్లా కలికిరి రోడ్డుపై మృతి చెంది ఉన్నారు. ఆయన మృతదేహాన్ని గుర్తించి హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. రాజేందర్ తన స్నేహితులతో కలిసి బెంగళూర్ వెళుతున్నట్టు చెప్పి ఏపీలోని మదనపల్లికి వెళ్లారని చంద్రబోస్ చెబుతున్నారు. ఓ భూమికి సంబంధించి మాట్లాడటానికి మదనపల్లికి వెళ్లాడని.. ఈ నెల 3న అనుమానాస్పద స్థితిలో మరణించి ఉన్నాడని చెబుతున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. తన భర్తతో శ్రీనివాస్, సుధీర్ అనే ఇద్దరు వ్యక్తులు వెళ్లారని మృతుడు రాజేందర్ భార్య చెబుతున్నారు. ఇదిలా ఉంటే చంద్రబోస్ అన్న రాజేందర్, ఆయన సతీమణి వసంత దుండిగల్ పరిధిలోని బౌరంపేటలో ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు. రాజేందర్ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా గత నెల 18న బెంగళూరుకు వెళుతున్నట్టు తన భార్యకు సమాచారం ఇచ్చి వెళ్లాడు.






