- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి సంక్రాంతి బరిలో రవితేజ.. మాస్టర్ ప్లాన్‌తో వస్తున్న దిల్ రాజు
రవితేజ – దిల్ రాజు కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాను సంక్రాంతి బరిలో విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: మాస్ మహారాజా రవితేజ తన సినిమాలను సంక్రాంతి బరిలో నిలపడానికి ఆసక్తి చూపే హీరోల్లో ఒకరు. ఆయన హీరోగా నటించిన అనేక చిత్రాలు ఇప్పటికే సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యాయి. ముఖ్యంగా ‘క్రాక్’ సినిమా సంక్రాంతి బరిలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కూడా తన సినిమాలను సంక్రాంతి రేస్‌లో ఉంచాలని రవితేజ ప్రయత్నించినప్పటికీ, వివిధ కారణాల వల్ల అది సాధ్యపడలేదు. ఈ ఏడాది ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ, ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం రవితేజ ‘ఇరుముడి’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు.
ఈ సినిమాను ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీ అనంతరం హసిత్ గోలి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో రవితేజ మరో సినిమా చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను సంక్రాంతి బరిలో విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు కూడా తన నిర్మాణంలో వచ్చే సినిమాలను సంక్రాంతి సీజన్‌లో విడుదల చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. దీంతో రవితేజ – దిల్ రాజు కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌ను సంక్రాంతి రేస్‌లో నిలపడానికి ఇప్పటినుంచే సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.






