- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్రివిక్రమ్ లిస్టులోకి ప్రభాస్.. ‘గాడ్ ఆఫ్ వార్’పై మళ్లీ సస్పెన్స్
త్రివిక్రమ్ - ప్రభాస్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు రావడంతో ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమాపై ప్రస్తుతం సస్పెన్స్ నెలకొంది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ హీరోగా ‘ఆదర్శ కుటుంబం ఏకే 47’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ‘గాడ్ ఆఫ్ వార్’ అనే భారీ ప్రాజెక్ట్‌ను త్రివిక్రమ్ తెరకెక్కించనున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నట్లు కూడా ప్రచారం జరిగింది. ఈ అంశంపై నాగవంశీ పలుమార్లు స్పందించడంతో, వెంకటేష్ సినిమా షూటింగ్ పూర్తయ్యాక త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబో ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందనే వార్తలు బలంగా వినిపించాయి.
అయితే, తాజాగా మరో వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. వెంకటేష్ సినిమా అనంతరం త్రివిక్రమ్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ఓ భారీ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘కల్కి పార్ట్ 2’ చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్-ప్రభాస్ కాంబినేషన్ నిజంగా సెట్ అయితే, ఎన్టీఆర్‌తో చేయనున్నట్లు ప్రచారం జరుగుతున్న ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది? అసలు ఆ ప్రాజెక్ట్ ఉంటుందా? లేదా? అనే అనుమానాలు సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.






