- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్ది స్క్రీన్‌ప్లేపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రత్నవేలు
రత్నవేలు మాట్లాడుతూ... పెద్ది రియలిస్టిక్ కథ అయినప్పటికీ స్క్రీన్‌ప్లే మాత్రం కమర్షియల్ టెంప్లేట్‌లో ఉంటుందని తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: పెద్ది చిత్రంలో రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో చిత్ర బృందం భారీగా ప్రమోషన్లు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇంటర్వ్యూలో ఆయనకు ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయా అనే ప్రశ్న ఎదురవగా, ఆయన స్పందిస్తూ... ఈ సినిమాలో అనేక యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని చెప్పారు. ఈ చిత్రాన్ని రియలిస్టిక్ కథ నేపథ్యంతో రూపొందినప్పటికీ, స్క్రీన్‌ప్లే మాత్రం కమర్షియల్ టెంప్లేట్‌లో ఉంటుందని తెలిపారు. దీంతో అద్భుతమైన యాక్షన్ బ్లాక్స్ ఈ సినిమాలో ఉండనున్నట్లు, అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆయన చెప్పుకొచ్చారు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని ఏ.ఆర్. రెహమాన్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు.






